ఛార్లెస్ బాబేజ్
ఆధునిక కంప్యూటింగ్ పితామహుడు, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వారందరూ తలవంచి పాదాభివందనం చేయాల్సిన మహాశయుడు ఛార్లెస్ బాబేజ్. ఈయన డిసెంబర్ 26 తేదీన జన్మించారు. ఇంతకీ బాబేజ్ తొలి కంప్యూటర్ను రూపొందించారా అంటే అలాటిదేమీ లేదనే చెప్పారు. ఏవేవో రూపొందించాలన్న తపనతో ఆయన చేపట్టిన అనేకానేక ప్రయోగాలు, పరిశోధనలు, వాస్తవంగా చెప్పాలంటే విఫలమే అయినా ఆయననే కంప్యూటర్ ప్రపంచమంతా ఆధునిక డిజిటల్ కంప్యూటింగ్ పితామహుడిగా భావిస్తారు. 

విఫలాలను చవిచూసిన వ్యక్తే విజేతగా గుర్తించడం విశేషమే మరి!  బాబేజ్ జీవితం గురించి ప్రయోగాల గురించి ఆలోచించటానికి ముందు అప్పటి వరకు గణిత శాస్త్రంలో జరిగిన ప్రయోగ పరిశోధనల గురించి ఆలోచించాల్సి వుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అది కంప్యూటర్ల ఆవిర్భావం గురించిన సింహావ లోకనమే అవుతుంది. ఛార్లెస్ బాబేజ్ 1792లో డిసెంబర్  26 లండన్‌లో జన్మించారు. 1791లో జన్మించారనే వాదన కూడా ఉంది..
ఆయన జీవితమంతా కంప్యూటర్ పరిశోధనలకే సరిపోయింది. అప్పట్లో పోస్టాఫీసులు, ఉత్తరాలకే ఫిక్స్డ్ కాస్ట్ స్టాంపులను అమ్మేవి. ఉత్తరం వెళ్లాల్సిన బట్వాడా ఖర్చు ఒకే ధర ఉండటం అర్థం లేదని భావిస్తూ బాబేజ్ వేర్వేరు దూరాలకు వేర్వేరు ధరల పద్దతిని ప్రతిపాదించారు.

ప్రతిపాదన ఎంత శాస్త్రీయమో ప్రయోగత్మకంగా చూపారు. ఇప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ బీమాల ప్రీమియంలో లెక్కలకై వాడేమోర్టాలిటీ టేబుల్స్”ను తొలిసారిగా బాబేజ్ రూపొందించారు. వాహనాల ప్రయాణ వేగం తెలిపే స్పీడో మీటరు రూపకర్త కూడా ఈయనే.

కంటిలోనిరెటీనా పనిచేసే పద్ధతిని పరిశీలించేందుకు వీలుగా ఆయన తొలిఆప్తాల్మాస్కోప్” ను రూపొందించారు. కానీ దాన్ని తర్వాత మెరుగులు దిద్దినహెల్మ్హోల్జ్”కు పరికరం కొనుగొన్న ఘనత దక్కడం విచిత్రం.

బాబేజ్ రూపకల్పన చేసిన డిజైన్ ఆధారంగా బాబేజ్ కుమారుడు 1879లో సిద్ధం చేసిన ఎనలిటికల్ ఇంజన్లో ఒక భాగాన్ని ఇటీవలే వేలం వేశారు. ఆస్ట్రేలియాలోని పవర్ హౌస్ మ్యూజియం దాన్ని మూడు లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. 1991లో లండన్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు బాబేజ్ డిజైన్తో,  బాబేజ్‌కు ఆకాలంలో అందుబాటులో ఉన్న విడి భాగాలతో ఒక వర్కింగ్ మెషిన్ను రూపొందించారు. వందల పౌండ్లు బరువుండే మెషిన్ను ఎన్నిసార్లు ఆపరేట్ చేసినా, ఎన్ని రకాలుగా లెక్కలు చేసినా ఒక తప్పు అయినా చేయక పోవటం విశేషమని బాబేజ్ ఫౌండేషన్ వివరిస్తోంది.

బాబేజ్ రూపొందించిన డిఫరెన్స్ ఇంజన్నే తొలి ప్రాక్టికల్ మెకానికల్ క్యాలుకులేటర్గా భావించాలి. గుణింతాలను సైతం బహు తేలికగా చేయగల పద్ధతిని ఆయన డిఫరెన్స్ ఇంజన్ను సిద్ధం చేశారు. దీనికి ఆయన 1801నాటికి రూప కల్పన జరిగిన జాక్వార్డ్ వీవింగ్ లూమ్ను స్ఫూర్తిగా తీసుకొన్నారు. జాక్వార్డ్ వీవింగ్ లూమ్ పంచ్డ్ కార్డ్ నియంత్రణ పద్ధతిలో పనిచేస్తుంది. దీని రూపకర్త జోసెఫ్ మేరీ జాక్వార్డ్‌. కార్డుల మీద వ్యూహాత్మకమైన రీతిలో రంధ్రాలు చేసి కార్డులను ఒక పద్ధతి ప్రకారం అమర్చటం వల్ల ఒక నిర్ణీతమైన నేత డిజైన్ రావటం దీనికి పునాది. పంచ్ కార్డ్ విధానాన్ని బాబేజ్ తన ఎనలిటకల్ ఇంజన్ రూపకల్పనకు ఆధారంగా స్వీకరించారు.

తర్వాత కాలంలో తొలి ఆధునిక కంప్యూటర్ల చరిత్ర సుమారు 1942 ప్రాంతంలో ఆరంభమైనప్పటికి వాటి ఆవిర్భావానికి శ్రీకారం మాత్రం అప్పటికి చాలా కాలం ముందు ప్రారంభమయింది. చరిత్రలోకి తొంగి చూస్తే మనకు తొలి గణన సాధనంగా అబాకస్ కానవస్తుంది. అదిప్పటికి సుమారు ఐదు వేల సంత్సరాల పుర్వానిది. ఇప్పటికీ జపాన్లోని అత్యాధునిక స్టోర్లలో లెక్కలన్ని కంప్యూటర్ మీద చేసి వాటిని అబాకస్ మీద సరిచూసుకొంటారట. ఒక పలక మీద పది వరుసల పూసలతో అబాకస్ ఒకట్ల నుండి సంఖ్య వరకైనా సరే లెక్కలు చేయగలగటం విశేషం.
అబాకస్ అందించిన స్పూర్తితో బ్లెయిజ్ ఫాస్కల్ (1623-1662) అనే ఫ్రెంట్ గణిత శాస్త్రజ్ఞుడు మెకానికల్ యాడింగ్ మిషన్ను రూపొందించారు. దీంట్లో లెక్కలకు గేర్ ద్వారా నడిచే కౌంటింగ్ వీల్స్ ఉండేవి. పూసల బదులు వీల్స్, చేతులు, బదులే గేర్స్ అన్నమాట. యంత్రానికి ఫాస్కలైన్ యంత్రం అని పేరు పెట్టారు. దీనికి ఎటువంటి మరమ్మత్తులు చేయాల్సి వచ్చినా ఫాస్కల్ రూపొందించిన కౌంటింగ్ వీల్ డిజైన్ మాత్రం 1960 వరకు అన్ని రకాల మెకానికల్ కాలుక్యులేటర్స్కు వెన్నుముకై మిగిలింది.
తరువాత అంచలంచెలుగా కంప్యూటర్ రంగం అభివృద్ధి చెంది నేడు అంతరిక్షానికే సంకేతాలను కంప్యూటర్ ద్వారా పంపించేటంత అభివృద్ధిని సాధించాము. కాని ఎవరెంతమంది కంప్యూటర్ను ఆధునీకరణ గావించినా కంప్యూటర్ను కనుగొన్న పితామహుడు ఛార్లెస్ బాబేజ్ మాత్రమే అని చెప్పవచ్చు.

కామెంట్‌లు